Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం. విలన్ గా ఆమె పన్నిన కుట్రలు.. చూపించిన విలనిజానికి అభిమానులు మంత్రం ముగ్దులు అయ్యారు. ఇక తాజాగా అదే విలనిజాన్ని శోభా బిగ్ బాస్ లో చూపించడం మొదలుపెట్టింది. రెండు రోజుల క్రితమే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే 14 మంది కంటెస్టెంట్స్ తో కళకళలాడుతున్న హౌస్ లో ఎలిమినేషన్ చిచ్చు పెట్టింది. ఒక్కో కంటెస్టెంట్ ను యాక్టివ్ ఏరియాకు పిలిచి.. ఇద్దరిని నామినేట్ చేయాలి.. అది కూడా పర్ఫెక్ట్ రీజన్స్ తో అని బిగ్ బాస్ కండీషన్స్ పెట్టడంతో.. ఒక్కో కంటెస్టెంట్ తమకు నచ్చిన రీజన్స్ చెప్పి బిగ్ బాస్ ను ఒప్పించారు. ఇక శోభా శెట్టి.. మొదట కిరణ్ రాథోడ్ ను నామినేట్ చేసింది. అందుకు రీజన్ గా ఆమెకు భాష రాదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత గౌతమ్ కృష్ణను కూడా నామినేట్ చేసింది. ఇక శోభా నామినేషన్ తప్పు అని కిరణ్ వాదించింది. భాష ప్రాబ్లెమ్ కాదని ఆమె చెప్పుకొచ్చింది.
Vijay Setupathi: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వదిలేసి మంచి పనే చేశాడు..?
ఇంకోపక్క శోభాను సింగర్ దామిని నామినేట్ చేసింది. దీంతో ఆమెపై శోభా రెచ్చిపోయి గొడవపెట్టుకుంది. దామిని చేసింది తప్పు అంటూ వాదించింది. దామిని సైతం ఒకవేళ అది తప్పు అయ్యి ఉండొచ్చు అని చెప్పేలోపు.. అది తప్పే అని ఆమెపై విలనిజాన్ని చూపింది. ఇక డామినితో పాటు గౌతమ్ కృష్ణపై కూడా అమ్మడు ఒకింత కోపాన్ని చూపించింది. శోభా గారు అని గౌతమ్ పిలవగా.. అంత రెస్పెక్ట్ అవసరం లేదని చెప్తూ.. మీరు చెప్తుంటే వినడానికే రెడీ గా లేరు.. అందుకే.. మీకు ఇష్టం లేదు అంటే.. చెప్పడానికి నేను కూడా రెడీగా లేను అని వెళ్లిపోయింది. ఇలా ఇంట్లో ఉన్నవారందరితో శోభా కయ్యానికి కాలు దువ్వుతుంది. మోనితాల కుట్రలు, కోపాలు ఇక్కడ పనికిరావు.. ఇక్కడ ఎంత మంచి చేసుకుంటే.. అన్ని ఎక్కువ రోజులు ఉంటారు. అలాంటిది.. శోభా అనవసరంగా మోనిత లా మారి గొడవలు పెట్టుకొని స్ట్రాంగ్ గా ఉండాలని ట్రై చేస్తూ.. వీక్ అయిపోతుంది అని అభిమానులు అంటున్నారు. మరి ఈ హౌస్ లో మోనితా .. అదే శోభా ఎన్ని వారాలు ఉంటుందో చూడాలి.