NTV Telugu Site icon

Hrithik Roshan: నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్న తారక్.. రా చూసుకుందాం

Hrithik Wishes Ntr

Hrithik Wishes Ntr

Hrithik Roshan Wishes NTR Birthday In A Unique Way: ఈరోజు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రియులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ మాత్రం అందరికంటే భిన్నంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. తారక్‌కి బర్త్‌డే విషెస్ తెలియచేస్తూనే, నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నానంటూ పరోక్షంగా ‘వార్ 2’ సినిమాపై అప్డేట్ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ చివర్లో తెలుగులో ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగులో టచ్ కూడా ఇచ్చాడు. ‘హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంతోషకరమైన రోజుని నువ్వు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నీకోసం నేను యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంత వరకు నీ ప్రతిరోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి.. వీళ్లిద్దరు కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారని మరోసారి అనధికారికంగానే కన్ఫమ్ అయ్యింది.

Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్‌..!

ఇంతకుముందు వచ్చిన ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఆ సినిమా అప్పట్లో కలెక్షన్ల సునామీ సృష్టించి, బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. అయితే.. సీక్వెల్‌కి మాత్రం దర్శకుడు మారాడు. ‘బ్రహ్మాస్త్ర’ను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ని రూపొందించనున్నాడు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపుదాల్చుకుంటోంది. ఇందులో తారక్, హృతిక్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. హృతిక్ కథానాయకుడిగా కొనసాగుతుండగా, తారక్ మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం తాము చేస్తున్న ప్రాజెక్టులను ముగించుకున్న తర్వాత.. ‘వార్ 2’ సినిమా సెట్స్‌లోకి తారక్, హృతిక్ చేరనున్నారు. అందుకు కొంత ఎక్కువ సమయమే వేచి ఉండాల్సి ఉంటుంది.

Simhadri 4K: ఫాన్స్ తో సింహాద్రి చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన జక్కన ఫ్యామిలీ