హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ విజువల్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన రాజమౌళి లాంటి తక్కువ మంది దర్శకులు మాత్రమే చూపిస్తారు. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని జక్కన్న కూడా ఇప్పటివరకూ ప్రయత్నించలేదు. అయితే బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ ఆ లోటుని భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు. టాప్ గన్ మేవరిక్ రేంజ్ సినిమా చెయ్యాలి అంటే టామ్ క్రూజ్ రేంజ్ హీరో కూడా ఉండాలిగా అందుకే ఇండియన్ టామ్ క్రూజ్ హ్రితిక్ రోషన్ తో టీమ్ అప్ అయ్యాడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ఒకసారి ఈ కాంబినేషన్ లో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా వచ్చింది. ఈ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ బాలీవుడ్ లో ది బెస్ట్ అనిపించుకున్నాయి. ఇప్పుడు ఫైటర్ సినిమాతో మరోసారి కలిసిన సిద్దార్థ్ ఆనంద్, హ్రితిక్ రోషన్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
క్రీజీ కాంబినేషన్ తో సెట్ చేసిన ఫైటర్ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. టీజర్ లోనే ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉంది. హ్రితిక్ స్క్రీన్ ప్రెజెన్స్ గాడ్ లెవల్ అంతే. ఏ ఇండియన్ హీరో కూడా హ్రితిక్ కి ఉన్నంత క్యాప్చరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ లేదేమో. దీపికా, అనిల్ కపూర్ లుక్స్ ని కూడా ఫైటర్ టీజర్ లో రివీల్ చేసారు. హ్యూజ్ సెట్స్, ఊహకందని యాక్షన్ బ్లాక్స్ తో ఫైటర్ టీజర్ ప్యాక్డ్ గా ఉంది. ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఎండ్ షాట్ లో హ్రితిక్ చోపర్ దిగుతున్న టైమ్ లో వచ్చిన కట్ షాట్స్ ఫాస్ట్ పేజ్ లో ఉండి మెస్మరైజ్ చేసాయి. ఓవరాల్ ఒక హాలీవుడ్ రేంజ్ హిందీ సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ జనవరి 25న చూడబోతున్నారు అనే విషయం ఒక్క టీజర్ తోనే నిరూపించింది ఫైటర్ సినిమా.
हर उड़ान वतन के नाम! 🇮🇳
Fighter forever. #FighterTeaser Out Now – https://t.co/QCiae3kWG8 pic.twitter.com/idUvDoNGfW
— Hrithik Roshan (@iHrithik) December 8, 2023