NTV Telugu Site icon

Kantara Movie: ‘కాంతారా’తో గూస్ బంప్స్ వచ్చాయంటున్న గ్రీక్ గాడ్

Kantara Movie

Kantara Movie

Kantara Movie:  రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాంతారా’కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో జననీరాజనం లభించింది. ఈ చిత్రాన్ని చూసిన హృతిక్ రోషన్ క్లైమాక్స్‌ని మెచ్చుకోవడమే కాదు గూస్‌బంప్స్ తెప్పించిందంటూ ట్వీట్ చేశాడు. సినిమా చూసిన తర్వాత ట్విట్టర్‌లో రిషబ్ శెట్టి నమ్మకం సినిమాను అసాధారణమైనదిగా చేసింది. కథతో పాటు దర్శకత్వం, నటన ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక క్లైమాక్స్ అయితే తనకు గూస్‌బంప్స్ తెప్పించిందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ప్రభాస్, సుదీప్, ధనుష్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కాంతారా’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ జాబితాలో హృతిక్ పేరు కూడా చేరింది.

Read Also: Gopichand: శోభన్ బాబు టైటిల్ తో గోపీచంద్