మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఫస్ట్ హిట్ ను చవిచూసింది. ఈ నెల 22న ప్రపంవ్యాప్తంగా విడుదలైన ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ‘హృదయం’ మలయాళంలో ఈ ఏడాది తొలి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామాకు క్రిటిక్స్ తో పాటు వీక్షకుల నుండి కూడా చక్కటి స్పందన లభించటం విశేషం. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ కి జతగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ సినిమా విడుదలకు ముందే భారీ బజ్‌ని క్రియేట్ చేసింది. ‘హృదయం’ సినిమా ఒక యువకుడి జీవితంలోని వివిధ దశల ద్వారా చేసే ప్రయాణాన్ని ఆవిష్కరించింది.
Read Also : ‘డీజే టిల్లు’ మనసులో ‘పటాస్ పిల్లా’ టెంట్… రొమాంటిక్ సాంగ్
దాంతో యువతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద 3 కోట్లు వసూలు చేయటం గమనార్హం. దీంతో తెలుగు దర్శకనిర్మాతల దృష్టి ఈ సినిమాపై పడింది. దీనిని తెలుగులో రీమేక్ చేయటానికి హక్కులు పొందే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ‘కప్పెల, నాయట్టు, అయ్యప్పనుమ్ కోషియుమ్’ వంటి సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. వాటి సరసన ఇప్పుడు ‘హృదయం’ కూడా చేరనుంది. మలయాళంలో మేరీలాండ్ సినిమాస్ తో కలసి బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. మరి తెలుగులో ఈ సినిమా రీమేక్ హక్కులను ఎవరు దక్కించుకుంటారు? ఎవరితో తెరకెక్కిస్తారన్నది చూడాలి.