NTV Telugu Site icon

Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…

Masooda

Masooda

హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. నవంబరు 18న రిలీజ్ అయిన ఈ సినిమాలో సంగీత‌, తిరువీర్‌, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించగా ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.

చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ సినిమాగా పేరు తెచ్చుకోని సూపర్ హిట్ అయ్యింది. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ‘మసూద’ సినిమా ‘ఆహా’ స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ‘ఆహా వీడియో’ వాళ్లు ట్వీట్ చేశారు. “లైట్స్ ఆఫ్ చేసి, ఆహా ఆన్ చేసి మసూద సినిమాని చూసెయ్యండి” అంటూ ఆహా అఫీషియల్ ఎకౌంటు నుంచి ట్వీట్ చేశారు. నిజానికి డిసెంబర్ 22న విడుదల అవ్వాల్సిన ‘మసూద’ సినిమాని ఆడియన్స్ డిమాండ్ మేరకు ఆహా వాళ్లు కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మంచి హారర్ సినిమా చూడాలి అనుకున్న వాళ్లు, ఆప్ ఓపెన్ చేసి మసూద సినిమాని చూసేయండి.

Show comments