NTV Telugu Site icon

Salaar: ‘సలార్’ రిస్కా? ఏం పర్లేదు… అక్కడుంది పాన్ ఇండియా కటౌట్!

Prabhas

Prabhas

పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్ 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అప్ కమింగ్ మూవీ ‘సలార్’ రెండు భాగాలు కావడంతో.. థియేటర్ బిజినెస్ లెక్కల నుంచే దాదాపు 600 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. అందులో కూడా కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసమే దాదాపు 200 కోట్లు కోట్ చేస్తున్నారట. ఏ ఇండియన్ సూపర్ స్టార్ హీరో సినిమాకి ఇంత బిజినెస్ జరగట్లేదు. ఎంత ప్రభాస్ అయినా 200 కోట్లు ఖర్చు పెట్టడం రిస్క్ అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ‘సలార్’కు ఎంత క్రేజ్ ఉన్నా… 200 కోట్ల షేర్ వసూల్ చేయడం అంటే మామూలు విషయం కాదు, మన తెలుగులో ఓ స్టార్ హీరో క్లోజింగ్ కలెక్షన్స్ అవి. అలాంటిది.. సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు జరిగితే.. గ్రాస్ దానికి డబుల్ రాబట్టాల్సి ఉంటుంది పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ ట్రాక్ రికార్డ్ బాగాలేదు బయ్యర్స్ కూడా అంత మొత్తం పెట్టి థియేటర్ హక్కులని కొనడానికి భయపడడంలో తప్పులేదు.

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బయ్యర్స్ ని నష్టాలు తెచ్చిన మాట వాస్తవమే కానీ ఫ్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ 450-550 కోట్లు రాబట్టాడు. ఎంత రాబట్టాడు అని పాత సినిమా లెక్కలు వేసుకోవడానికి, పోయిన మూడు సినిమాలకి రాబోయే సినిమాకి జమీన్ -ఆస్మాన్ ఫరక్ ఉంది. KGF2 సినిమాతో 1200 కోట్లు చేసిన ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ని మైంటైన్ చేస్తున్న ఏకైక దర్శకుడు. ఇలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ దొరికితే రిజల్ట్ ఏ రేంజులో ఉంటుందో టీజర్ ఇప్పుడే నిరూపించింది. టీజర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని ట్రైలర్ తో ప్రశాంత్ నీల్ మరింత పెంచుతాడు. ఈ డెడ్లీ కాంబినేషన్ ప్రత్యేకించి చెయ్యాల్సింది ఏమీ లేదు, ప్రెజెంట్ ఉన్న అంచనాలని అందుకుంటే చాలు. సలార్ సినిమా ఎంత బిజినెస్ నైనా ఊది అవతలేస్తుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సలార్ కౌంట్ వెయ్యి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చూడాలి. అందుకే సలార్ కోసం రిస్క్ చేసినా.. ఏం పర్లేదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Show comments