Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుండి పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుందంటే హిందీ, మలయాళం, తమిళ్ ఇండస్ట్రీల నుండి విలన్స్‌ను తెచ్చుకోవడం కామన్. కానీ తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా దాటి పాన్ ఇంటర్నేషనల్‌కు చేరుకుంది. దీంతో విలన్ రోల్స్ కోసం విదేశీ నటుల్ని అప్రోచ్ అవుతున్నారు తెలుగు మేకర్స్. త్రిబుల్ ఆర్‌లో విదేశీ నటుల్ని ఇంపోర్ట్ చేసి.. టాలీవుడ్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ కు పరిచయం చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. గవర్నర్ స్కాట్‌గా రే స్టీవెన్సన్.. ఆయన భార్యగా అలిసన్ డూడీ నటించారు.
విజయ్ దేవరకొండ హై ఆక్డేన్ ఫిల్మ్ రణబాలిలో నెగిటివ్ షేడ్ కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూని తీసుకొచ్చాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. మమ్మీ చూసిన ప్రతి ఒక్కరికి ఆర్నాల్డ్ పరిచయమే. రణబాలిలో బ్రిటీష్ అధికారి సార్ థియోడర్ హెక్టర్ పాత్రలో.. పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ హాలీవుడ్ యాక్టర్. 1854-1878 మధ్య కాలంలో బ్రిటీష్ పాలనలో, రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది రణబాలి. త్రిబుల్ ఆర్ అండ్ రణబాలి బ్రిటీష్ కాలంలో సాగే కథలు కాబట్టి.. ఆ కారెక్టర్స్‌కు తగ్గట్లుగా విదేశీ నటుల్ని ఇక్కడకు తెచ్చారు. స్పిరిట్‌లో డాన్ లీని తెద్దామనుకున్నా.. అతడ్ని ఏదో ఒక కారెక్టర్ కోసం ఇరికించలేక తీసుకురాలేదన్నారు మేకర్స్. కానీ బన్నీ రాకాలో విలన్ రోల్ కోసం హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్‌ని దిగుమతి చేయబోతున్నాడట అట్లీ. విలన్ రోల్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. మరీ కథకు తగ్గట్లుగా బన్నీ కోసం అట్లీ విల్ స్మిత్‌ను ప్లాన్ చేశాడా..? లేక హాలీవుడ్ మార్కెట్ కోసం చేస్తోన్న వ్యూహామా? నిజంగానే అతడు ఉన్నాడా లేదా అనేది ఏదో ఒక అప్టేట్ లేక రాకా టీజర్ ఆర్ ట్రైలర్లో రివీల్ చేస్తారేమో చూడాలి.
Also Read
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
- Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 'కాకా' లేనట్టేనా..?
- Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!