Allu Arjun: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు ఇప్పుడు హాలీవుడ్ ను ఏలడానికి ప్రయత్నిస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హాలీవుడ్ డైరెక్టర్స్ ను, ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్స్ ఆర్ఆర్ఆర్ ను చూసి ట్వీట్ చేసిన విషయం విదితమే. ఇక ఇటీవలే న్యూయార్క్ సిటీలో జరిగిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో బన్నీకి అందిన గౌరవం ను బట్టే చెప్పొచ్చు అక్కడ అతనికి ఉన్న ఫ్యాన్స్ బేస్. ఇక ఈ వేడుక అనంతరం అల్లు అర్జున్ ను ఒక హాలీవుడ్ డైరెక్టర్ పర్సనల్ గా మీట్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి.సదురు డైరెక్టర్ బన్నీ యాక్టింగ్ కు ఫిదా అయ్యి హాలీవుడ్ సినిమాకు ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బన్నీ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడం ఖాయమని చెప్పాలి.
ఇప్పటివరకు ఈ వార్తపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ కూడా స్పందించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యా అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటివరకు టాలీవుడ్ హీరోల్లో రాజేంద్ర ప్రసాద్, ఇటీవల కాలంలో సమంత మాత్రమే హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇక వీరి లిస్ట్ లోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. త్వరలో టాలీవుడ్.. హాలీవుడ్ ను డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అభిమానులు అంటున్నారు.