OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Movie: మనుషులు కాదు.. గొర్రెలే డిటెక్టివ్లైతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రంగా అనిపించినా, తెరపై మాత్రం ఆ ఆలోచన అద్భుతమైన వినోదాన్ని పంచుతోంది . ఒక హత్య కేసును ఛేదించేందుకు తెలివైన గొర్రెల మంద రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’ (The Sheep Detectives). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హాలీవుడ్ కామెడీ మిస్టరీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియోతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తోంది. ప్రఖ్యాత రచయిత్రి లియోనీ స్వాన్ రాసిన ‘త్రీ బ్యాగ్స్ ఫుల్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు. లైవ్ యాక్షన్, యానిమేషన్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరిస్తోంది.
‘ది షీప్ డిటెక్టివ్స్’ కథ
డెన్బ్రూక్ అనే ప్రశాంతమైన గ్రామంలో జార్జ్ హార్డీ అనే గొర్రెల కాపరి ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. తన గొర్రెలంటే అతనికి అపారమైన ప్రేమ. ప్రతి రాత్రి వాటికి అగాథా క్రిస్టీ వంటి రచయితల క్రైమ్ నవలలు, డిటెక్టివ్ కథలు చదివి వినిపించడం అతని అలవాటు. అయితే ఆ కథలను వింటూ వింటూ గొర్రెలు అసాధారణమైన పరిశీలనా శక్తిని అలవర్చుకుంటాయి. కానీ ఈ విషయం జార్జ్‌కు తెలియదు. ఒకరోజు జార్జ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందుతాడు. స్థానిక పోలీసులు అది ప్రమాదమని భావించి కేసును ముగించేందుకు సిద్ధమవుతారు. కానీ తమ యజమాని హత్యకు గురయ్యాడని గొర్రెలు గుర్తిస్తాయి. ఆ తర్వాత అవే ఒక డిటెక్టివ్ టీమ్‌గా మారి నిజమైన నిందితుడిని వెతికే పనిలో పడతాయి. జార్జ్ వీలునామా ఆధారంగా బయటపడిన అనుమానితులను ఒక్కొక్కరిని పరిశీలిస్తూ, తమకు తెలిసిన డిటెక్టివ్ పద్ధతులతో దర్యాప్తు కొనసాగిస్తాయి. చివరికి హంతకుడు ఎవరు? గొర్రెలు నిజాన్ని ఎలా బయటపెట్టాయి? అనేదే సినిమా అసలు ఉత్కంఠ.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
సినిమాలో గొర్రెల పాత్రలను ఎంతో చమత్కారంగా తీర్చిదిద్దారు. ప్రతి విషయాన్ని గుర్తుంచుకునే మోపుల్, తెలివైన లిల్లీ, నాయకత్వ లక్షణాలు ఉన్న సెబాస్టియన్ వంటి పాత్రలు నవ్వులు పూయిస్తూనే కథను ముందుకు నడిపిస్తాయి. జార్జ్ పాత్రలో హ్యూ జాక్మన్ తనదైన నటనతో ఆకట్టుకోగా, ఎమ్మా థాంప్సన్ కీలక పాత్రలో మెప్పించారు. మొదటి భాగం సరదా కామెడీతో సాగితే, రెండో భాగంలో ఎమోషన్, సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఫ్యామిలీతో కలసి చూడచ్చు
109 నిమిషాల నిడివి గల ఈ చిత్రం మే 8 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందింది. వినూత్న కథాంశం, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలకు తోడు నవ్వులు పంచే స్క్రీన్‌ప్లే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సాధారణ థ్రిల్లర్లకు భిన్నంగా కొత్త తరహా మిస్టరీని ఆస్వాదించాలనుకునే వారికి ‘ది షీప్ డిటెక్టివ్స్’ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి ఒక వినోదభరితమైన, ఆసక్తికరమైన సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని తప్పక చూడవచ్చు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!