1998లో వచ్చిన షేక్స్‌పియర్ ఇన్ లవ్‌లో తన పాత్రకు గానూ గ్వినేత్ పాల్ట్రో ఉత్తమ నటి కేటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. 1991లో కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లల్లోనే ఆస్కార్ గెలుచుకున్న ఈ అమెరికన్ యాక్టర్… మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఐరన్ మ్యాన్ పర్సనల్ అసిస్టెంట్, ఫ్రెండ్ పాత్రలో నటించిన గ్వినేత్ పాల్ట్రో పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే గ్వినేత్ పాల్ట్రో వోగ్ మ్యాగజైన్ “ది 77 క్వేషన్స్” ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ సందర్భంగా ఆమె తన ఆస్కార్ ట్రోఫీని గార్డెన్‌లో డోర్ స్టాపర్‌గా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ వీడియో ఇంటర్వ్యూలో గ్వినేత్ పాల్ట్రో తన గార్డెన్ ని చూపిస్తూ… ఇంట్లో పెరిగిన మొక్కలు మరియు కూరగాయలని చూపిస్తూ ఉండగా… గ్వినేత్ పాల్ట్రోని ఫాలో అవుతున్న కెమెరామెన్, ఆగి డోర్ స్టాపర్ గా ఉన్న ఆస్కార్ ట్రోఫీపై చూసి ఆశ్చర్యపోయాడు. “ఎంత అందమైన అకాడమీ అవార్డు” అని కెమరామెన్ అనడంతో దానికి, గ్వినేత్, “నా డోర్‌స్టాప్. ఇది పర్ఫెక్ట్ పనిచేస్తుంది” అంటూ సమాధానం ఇచ్చింది. ఇది వైరల్ అవ్వడంతో ఆస్కార్ అవార్డుని అవమానించింది, అంతగా ఇష్టం లేకపోతే నామినేషన్స్ లో పోటీ చేయకుండా ఉండాల్సింది అంటూ గ్వినేత్ పాల్ట్రోపై విమర్శలు మొదలయ్యాయి. నిజానికి అవార్డులకు ఇలాంటి పరిస్థితి పట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సల్మాన్ ఖాన్ కూడా అవసరమైతే, డోర్ స్టాపర్ డ్యామేజ్ అయితే తన అవార్డులని డోర్ స్టాపర్స్ గా వాడుతానని ఓపెన్ గానే చెప్పాడు.
If you ever wondered where Gwyneth Paltrow keeps her Oscar… pic.twitter.com/TFKJ2NtY7Z
— Gary Hartley (@GaryHartleySA) October 9, 2023