నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దింతో ఇప్పుడు వచ్చిన హిట్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసారు.
Also Read : HHVM : హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం..
భారీ అంచానాల మధ్య విడుదలైన హిట్ 3 తొలి ఆట నుండే సుపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో హిట్ 3 సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 450K డాలర్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో దూసుకెళ్ళింది. అడ్వాన్స్ మరియు డే 1 కలిపి హిట్ 3 నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ రాబట్టింది. నాని కెరీర్ లోనే ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రిలీజ్ అయిన ఈ సినిమా అందుకు తగ్గట్టే వసూళ్లు రాబడుతోంది. మరోవైపు నేచురల్ స్టార్ నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి నార్త్ అమెరికాలో ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. ఆడియెన్స్ కలిసి అక్కడి థియేటర్స్ లో సినిమా చూస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మొత్తానికి హిట్ 3 యూఎస్ మార్కెట్ లో విధ్వంసం చేస్తోంది. భారీ స్టార్ట్ అందుకున్న హిట్ 3 ఈ వీకెండ్ కి 2 మిలియన్ మార్క్ ని దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.