Hit-2: ‘మేజర్’ ప్రమోషన్స్ తో ఆ సినిమా వెనక్కి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit-2 movie is back with Major’ promotions!
అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే… ఈ నెల 29న అడివి శేష్ ‘హిట్ -2’ మూవీ జనం ముందుకు వచ్చి ఉండేది. కానీ తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడనేది నానుడి. ‘హిట్ -2’ విషయంలోనూ అదే జరిగింది! బట్ జరిగేదంతా మంచికే అనుకోమంటారు పాజిటివ్ థింకింగ్ పీపుల్. ప్రస్తుతం ‘హిట్ 2’ టీమ్ కూడా ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంది. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ కూడా స్పష్టం చేశాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ విడుదల తర్వాత అన్ని ప్రాంతాలకూ దానిని తీసుకెళ్ళడం తన బాధ్యతగా భావించానని శేష్ తెలిపాడు. ఈ క్రమంలో శరీరకంగా, మానసికంగా బాగా అలిసి పోయానని అన్నాడు. అయితే దీనిని పాజిటివ్ గానూ తీసుకోవాలని కోరాడు. ‘మేజర్’ ప్రమోషన్స్ కారణంగా ‘హిట్ -2’ చివరి షెడ్యూల్ లో పాల్గొనలేకపోయానని, ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో అందుకు సిద్ధమౌతున్నానని చెప్పాడు. ‘హిట్ -2’ నిర్మాతలతో పాటు దర్శకుడు శైలేష్ కొలను కూడా తన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారని అడివి శేష్ తెలిపాడు. అతి త్వరలోనే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేస్తానని, ఆ వెంటనే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఇందులోని కృష్ణ దేవ్ (కేడీ)ను ఎప్పుడు జనం ముందుకు తీసుకొచ్చేది త్వరలోనే చెబుతామని అన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కథగా ఈ మూవీ ఉండబోతోంది. దీన్ని నాని సమర్పణలో ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు.
Also Read
- Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
- Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
- Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
- ‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
తాజావార్తలు
-
Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!