Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Shivaji OTT : బాక్సాఫీస్ వద్ద ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ‘రాజా శివాజీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ హిస్టారికల్ మూవీ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మరాఠీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను చూసే అవకాశం లభించింది. రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించిన ఈ చిత్రం, స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా ఆవిష్కరించింది. దీంతో ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
2026 మే 1న థియేటర్లలో విడుదలైన ‘రాజా శివాజీ’ మరాఠీ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించింది. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన తొలి మరాఠీ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రంగా కూడా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు, అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్, అత్యధిక సింగిల్ డే వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. రూ.50 కోట్లు, రూ.100 కోట్ల కలెక్షన్స్ ను అత్యంత వేగంగా చేరుకున్న సినిమాగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ఈ మూవీ.
Also Read
ఈ భారీ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ తో పాటు, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, మహేశ్ మంజ్రేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, సచిన్ ఖేడేకర్, అమోల్ గుప్తే, జితేంద్ర జోషి, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ కలసి నిర్మించిన ఈ చిత్రానికి సంగీత ద్వయం అజయ్ అతుల్ సంగీతం అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అద్భుతమైన విజువల్స్‌తో సినిమాకు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చారు. థియేటర్లలో చరిత్ర సృష్టించిన ‘రాజా శివాజీ’ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
- Tags
- cinema
- Raja Shivaji
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!