Site icon NTV Telugu

ధనుష్ మూవీని బ్యాన్ చేయాలంటున్న హిందూ సంఘాలు

dhanush

dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘అత్రంగి రే‘. ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమ కు ప్రస్తుతం వివాదాలు అంటుకున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అంతగా ఈ సినిమాలో ఏముంది అంటే ఈ సినిమా లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తుంది అనే పాయింట్ ని హిందూ సంఘాలు బయటపెట్టారు.

అస్సలు ఈ మూవీ కథ ఏంటంటే” హీరోయిన్ సారా అలీఖాన్, అక్షయ్ కుమార్ ప్రేమించుకుంటారు. అక్షయ్ కుమార్ ఒక ముస్లిం. ధనుష్ ఒక హిందూ యువకుడు. ప్రేమించిన వాడికి కాకుండా సారాను, ధనుష్ కి ఇచ్చి పెళ్లిచేస్తారు సారా తల్లిదండ్రులు. అయితే ప్రేమించినవాడిని వదులుకోలేక సారా, ధనుష్ ని వదిలి అక్షయ్ కుమార్ తో వెళ్ళిపోతుంది”. ఇది సినిమా కథ. హిందూ- ముస్లిం ల ప్రేమ కథను చూపించడం తప్పులేదు కానీ, అందులో పెళ్ళైన హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి కోసం పారిపోవడం లవ్ జిహాద్ ని ప్రేరేపించినట్లు అవుతుందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ఎప్పుడూ హిందు మతాన్ని టార్గెట్ చేస్తుంది. ఎన్నో సందర్భాల్లో హిందువలు మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలు తీసారు… ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలని కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు. మరి ఈ విషయమై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version