న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌరవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం అలాంటి హింట్స్ కనిపించట్లేదు. డిసెంబర్ లోనే రిలీజ్ అనేలా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఇప్పటికే గ్లిమ్ప్స్ తో ఇంప్రెస్ చేసిన హాయ్ నాన్న టీమ్… సమయమా సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. టాప్ ట్రెండ్ అయిన సమయమా సాంగ్ హాయ్ నాన్న సినిమాకి సూపర్బ్ బజ్ జనరేట్ చేసింది.
Read Also: MAD Trailer: ఫ్రెండ్స్ మీరు లేకపోతే… నా లైఫ్ ఇంకా మంచిగుండేది… ఈ ట్రైలర్అంతా యూత్ స్టఫ్
ఈ సాంగ్ విన్న వాళ్లందరూ హాయ్ నాన్న సినిమా లవ్ స్టోరీ ఏమో అనుకున్నారు… కాదు ఇది తండ్రి కూతురి ప్రేమకథని కూడా చూపిస్తుంది అంటూ సెకండ్ సాంగ్ బయటకి రాబోతుంది. “గాజు బొమ్మ” అంటూ సాగనున్న ఈ సాంగ్ కి నాని స్పెషల్ అనౌన్స్మెంట్ ప్రోమో చేసాడు. ఈ ప్రోమోతో గాజు బొమ్మ సాంగ్ అక్టోబర్ 6న బయటకి వస్తుందని మేకర్స్ రివీల్ చేసారు. ప్రోమో చివరలో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిట్ ఎక్స్ట్రాడినరిగా ఉంది. మరి ‘సమయమా’ సాంగ్ కి వచ్చి స్థాయి రెస్పాన్స్ గాజుబొమ్మ సాంగ్ కి కూడా వస్తుందేమో చూడాలి.
Read Also: Anirudh : దేవర కోసం రెండు ట్యూన్స్ సిద్ధం చేసిన అనిరుధ్..?
To every father ♥️
This one will be special …#HiNanna #GaajuBomma pic.twitter.com/NfnKX7hbrq— Nani (@NameisNani) October 3, 2023