యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్నాడు.. సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ పేరు పొందాడు. కోలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అనిరుధ్ హవా మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్‌కు అభిమానులు వీర లెవెల్ లో చిందులేస్తున్నారు. విక్రమ్‌లో కమల్‌కు అలాగే జైలర్‌లో రజనీకు అనిరుధ్ ఇచ్చిన మాస్ మ్యూజిక్‌కు తమిళ ఆడియన్స్ తో పాటు .. తెలుగు ఆడియన్స్ కూడా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో దేవర సినిమా ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమా కోసం అనిరుధ్ అప్పుడే రెండు పాటలను కూడా రెడీ చేశాడట. చిత్రయూనిట్ వాటిని ఒకే కూడా చేసిందని సమాచారం.ఇక అందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది.అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌కు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తుంది.సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన ముఖ్య మైన ఎపిసోడ్ షూట్ ఈ నెలలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. అలాగే బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.