Heroines : సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన భామలు.. కుర్రాళ్లను తమ అందంతో ఉర్రూతలూగించిన అప్సరసలు.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిలనే చేసుకోవాలి అనిపించేలా చేసిన హీరోయిన్లు.. చెదరని అందం.. తరగని ఆస్తి వారి సొంతం. అన్నీ ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. వయసు 45 ఏళ్లు దాటిపోతున్నా నో మ్యారేజ్ అంటున్నారు. ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. పెళ్లి ఊసెత్తితేనే పారిపోతున్నారు. ఇంత వయసొచ్చినా పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ల గురించి ఓ లుక్కేద్దాం.
Read Also : Ghaati : ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది
టబు..
1990 ప్రాంతంలో ఇండియన్ సినిమాలను ఊపేసింది. తెలుగు అమ్మాయి అయిన టబు.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు బాలీవుడ్ లో పెద్ద హీరోలతో చేసింది. టబు అందానికి భారీ ఫాలోయింగ్ ఉంది. వయసు 50 ఏళ్లు. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు పెరిగినా అందం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ ఇప్పటికీ బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. లైఫ్ లో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేస్తోంది.
నగ్మా..
సీనియర్ హీరోయిన్ నగ్మాకు అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందాలకు ఫిదా కాని అబ్బాయిలే లేరు. సౌత్ లోని అన్ని భాషల్లో నటించింది. బాలీవుడ్ లో సత్తా చాటింది. రాజకీయాల్లో కూడా రాణిస్తోంది. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీలో ఉంది. ఆమె వయసు 46 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా ఏడడుగులు మాత్రం వేయట్లేదు. ఈ బ్యూటీ కూడా అందరిలాగే అందాలను చెదరనీయకుండా మెయింటేన్ చేస్తోంది.
సుస్మితా సేన్..
ప్రపంచ సుందరిగా ఎంతో మంది గుండెల్ని కొల్లగొట్టింది. అందాలతో ఫ్యాన్స్ ను ఊపేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా మందితో డేటింగ్ లు చేసింది. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. వయసు 50 ఏళ్లు దాటిపోతున్నాయి. ఈ వయసులో కూడా సీనియర్ బిజినెస్ మ్యాన్ రోమన్ షాల్ తో డేటింగ్ చేస్తోంది. కానీ నో మ్యారేజ్ అంటుంది. లైఫ్ లో డబ్బు, ఎంజాయ్ మెంట్ కు కొదువ లేకుండా చూసుకుంటోంది. ప్రస్తుతానికి ఇద్దరిని దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తోంది.
శోభన
80, 90ల్లో హీరోయిన్‌గా చాలా పాపులర్ ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం ఆమె సొంతం. కానీ పెళ్లికి దూరంగానే ఉంది. 51ఏళ్లు దాటిపోతున్నా సరే పెళ్లికి నో అంటుంది. పెళ్లి ఒకటే జీవితం కాదని.. దానికంటే సంతోషంగా ఉంచే విషయాలు ఎన్నో మన లైఫ్ లో ఉంటాయని సూక్తులు చెబుతోంది. ఒంటరిగా ఉంటేనే చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటోంది.
అమీషా పటేల్
కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్. తెలుగులో బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. పర్సనల్ లైఫ్ లో చాలా మందితో రిలేషన్ పెట్టుకుంది. అదేంటో గానీ ఎవరినీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. ఇప్పుడు 45 ఏళ్లు దాటిపోతున్నా కత్తిలాంటి అందాలను మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తోంది. చాలా మంది మగాళ్లను చూశానని.. కానీ ఎవరూ తన మనసును అర్థం చేసుకోలేదని.. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నట్టు చెప్పింది.
త్రిష..
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష వయసు కూడా 43 ఏళ్లు. కానీ స్టిల్ బ్యాచిలర్ గానే ఉంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. త్వరలోనే థగ్ లైఫ్ మూవీతో రాబోతోంది. వయసు ఎంత పెరిగినా కుర్ర హీరోయిన్ లాగానే కనిపిస్తోంది. ఈమె కూడా కొందరు హీరోలతో డేటింగ్ లు చేసిందనే రూమర్లు ఉన్నాయి. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. పెళ్లిపై ఎప్పుడు అడిగినా దాటవేస్తోంది. మరి పెళ్లి చేసుకుంటుందా.. సింగిల్ గా ఉండిపోతుందా అనేది తెలియదు.
అనుష్క..
స్వీటీ అనుష్క శెట్టి వయసు 42 ఏళ్లు దాటిపోతోంది. సినిమాల పరంగా ఇంకా బిజీగానే ఉంది. ఎంత వయసు వచ్చినా అందం తరగట్లేదు. అలా అని పెళ్లి కూడా చేసుకోవట్లేదు. నో మ్యారేజ్ అంటూ సింగిల్ గా ఉండిపోతోంది. అమ్మడి గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపించినా.. అవన్నీ అవాస్తవాలే అని తేలిపోతున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో వేచి చూడాలి.
సితార
కెరీర్ మొదట్లో హీరోయిన్ గా చేసిన ఈ భామ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలో నటించింది. అలాగే భరత్ అనే నేను, అరవింద సమేత, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. ఆమె ఏజ్ 47 ఇయర్స్. కానీ నో మ్యారేజ్. సింగిల్ గానే హ్యాపీగా ఉన్నానని చెబుతోంది.
వీరే కాకుండా ఏక్తా కపూర్, కౌసల్య, నర్గీస్ ఫక్రీ, రీనా దత్తా లాంటి వారు పెళ్లి చేసుకోలేదు. తామంతా సింగిల్ గానే హ్యాపీగా ఉన్నామంటున్నారు.
Read Also : Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం.. థగ్ లైఫ్ కోసం హైకోర్టు కెక్కిన కమల్‌హాసన్..