Site icon NTV Telugu

Samantha – Sreeleela : ఒకే స్టేజిపై పుష్పరాజ్ భామలు..

Samantha

Samantha

Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్ జరిగింది.

Read Also : Thammudu : తమ్ముడు సెన్సార్ పూర్తి.. A సర్టిఫికెట్ వచ్చిందే..

అక్కడ సమంత, శ్రీలీల ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో సమంత సూపర్ హాట్ అన్నట్టే ఉంది. శ్రీలీల కూడా తన అందంతో కట్టిపడేసింది. దెబ్బకు ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. సమంత పుష్ప-1లో ఐటెం సాంగ్ చేసి ఊపేసింది. ఊ అంటావా మావ పాటతో కుర్రాళ్లకు మెంటెలక్కించింది.

ఇటు శ్రీలీల పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసింది. కిస్సిక్ పాటతో తన కత్తిలాంటి అందాలను ఆరబోసింది. ఈ పాటతోనే శ్రీలీలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సమంత ఓ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా శుభం మూవీతో మంచి హిట్ అందుకుంది.

Read Also : Siddharth : స్టేజి మీదనే ఏడ్చేసిన హీరో సిద్ధార్థ.. ఎందుకంటే..?

Exit mobile version