చిత్ర పరిశ్రమలో కరోనా విలయతాండవం చేస్తోంది. స్టారలందరు ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు హీరోయిన్ వారలక్షిమి శరత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.
” కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయినా కానీ ఆ వారాలు నాకు చాలా బాధ కలిగించాయి. ప్రస్తుతానికి నేను కోలుకొంటున్నాను.. వాక్సినేషన్ వలన ఈరోజు నేను బావున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండి. త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాను. నా కోసం ప్రార్దించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్నా అభిమానులు త్రిష త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.