ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు అభినయం కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే కూడా సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. మొదటి రెండు ఉన్నా మూడోది, అతి ముఖ్యమైనది లేక కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తోంది ‘కంచే’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్, తన అందంతో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కెరీర్ లో ఎక్కువ శాతం ట్రెడిషనల్ రోల్స్ చేయడంతో గ్లామర్ రోల్స్ ప్రగ్యా జైస్వాల్ కి రావడం మానేసాయి. ఇదే సమయంలో చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ప్రగ్యా కెరీర్ ఆశించిన స్థాయిలో జరగలేదు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువ లేకపోవడంతో ప్రగ్యా కెరీర్ దాదాపు క్లోజ్ అయిపొయింది.
కెరీర్ అయిపోతున్న టైంలో నందమూరి బాలకృష్ణ బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ ప్రగ్యాకి మాత్రం పెద్దగా కలిసి రాలేదు. దీంతో ప్రగ్యా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక చేసేదేమీ లేక తను పెట్టుకున్నా కంచెలు చెరిపేసి, ప్రగ్యా గ్లామర్ డోస్ పెంచి, తనలో ఎంత విషయం ఉందో చూపించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అదరకొడుతూ ఫాలోవర్స్ కి కిక్ ఇస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు జరపుకున్న ప్రగ్యా జైస్వాల్, కొత్త ఫోటోస్ ని సోషల్ మీడియాలో డంప్ చేసింది. థైస్ చూపిస్తూ, మత్తెక్కిన కళ్లతో ఫాలోవర్స్ కి కిక్ ఇస్తుంది. గతంలో బికినీ కూడా వేసుకున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. మరి పెరిగిన ఈ గ్లామర్ డోస్ ప్రగ్య కెరీర్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Best Birthday Ever ❤️💫
Thank you for all the love & warmest wishes..It was truly special 🥰🫶🏻 pic.twitter.com/r9xYtJrbzV
— Pragya Jaiswal (@ItsMePragya) January 13, 2023