NTV Telugu Site icon

Mrunal Thakur: దేవుడా.. సీత.. నువ్వు కూడా ఈ రేంజ్ లో చూపిస్తావనుకొలేదు

Mrunal Thakur

Mrunal Thakur

‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత అంటూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో కవితలు కూడా రాసేసారు. ఒక్క సినిమాతో సౌత్ లోని ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో మృణాల్ స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ సీతా అంటూ పిలుస్తూ ప్రేమ కురిపిస్తున్నారు. అంతటి హోమ్లీ ఇమేజ్ ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ కి రాలేదు. సీతా రామం సినిమా తర్వాత అప్పుడప్పుడూ బయట కనిపిస్తున్న మృణాల్ ఠాకూర్ సినిమాలోని ఇమేజ్ పూర్తి భిన్నంగా మోడరన్ లుక్ లో కనిపిస్తుంది. నార్మల్ గానే మృణాల్ మోడరన్ లుక్ లో ఉండే అమ్మాయి, తనకి సీతా రామం మంచి కెరీర్ టర్నింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కానీ అది తన రెగ్యులర్ లైఫ్ కాదు. ఈ విషయం అర్ధం చేసుకోకుండా మృణాల్ ఠాకూర్ మోడరన్ గా కనిపించగానే కొందరు సోషల్ మీడియాలో “సీతా ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, మా మనోభావాలు దెబ్బ తీయొద్దు, నువ్వు కూడా ఇలా స్కిన్ షో చేస్తావ్ అనుకోలేదు” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజాగా మరోసారి మృణాల్ ఠాకూర్ గురించి ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇందుకు కారణం ఒక పాట. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటిస్తున్న ‘సెల్ఫీ’ సినిమా నుంచి ‘కుడియె నీ తెరి’ అనే సాంగ్ బయటకి వచ్చింది. ఈ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో ముందెన్నడూ లేని విధంగా ఉంది. క్యారెక్టర్ పరంగా చూస్తే సెల్ఫీ సినిమాలో ఆమెది ఒక హీరోయిన్ రోల్. కుడియె నీ తెరి సాంగ్ కూడా హీరో పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ కి, హీరోయిన్ పాత్రలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కి మధ్య, సినిమా షూటింగ్ లో భాగంగా ఉంటుంది. అందుకే సాంగ్ ని అంత గ్లామర్ గా తెరకెక్కించారు. ఈ వీడియో సాంగ్ లో మృణాల్ ఠాకూర్ ని చూసిన వాళ్లు, “సీత నువ్వు కూడా ఈ రేంజులో చూపిస్తావ్ అనుకోలేదు” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పాపం మృణాల్ ని మోడరన్ లుక్ లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నట్లు లేరు. ఈ విషయాన్ని మృణాల్ అర్ధం చేసుకోని గ్లామర్ పాత్రలకి అయినా దూరంగా ఉండాలి లేదా ప్రేక్షకులే అది కెరీర్ లో భాగం అనుకోని ఎంజాయ్ చెయ్యడం స్టార్ట్ చెయ్యాలి. ఈ రెండింటిలో ఎదో ఒకటి జరిగితేనే మృణాల్ పైన వచ్చే కామెంట్స్ ఆగుతాయి. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నానితో కలిసి ఒక సినిమా చేస్తుంది. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది.

Show comments