Site icon NTV Telugu

Kavya Thapar: ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్.. అర్ధరాత్రి నడిరోడ్డుపై అలా చేసి

kavya

kavya

మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్‌ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు. ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గతరాత్రి ముంబైలోని జూహూ రోడ్లపై తప్పతాగి కారు నడిపి ఒక వ్యక్తిని గాయపరిచింది.

అనంతరం ఒక హోటల్ కి వచ్చి అక్కడ ఉన్నవారితో గొడవపడుతుండడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నించగా.. లేడి కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని కావ్య బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడడంతో ఆమెను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అంధేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. కోర్టు కావ్యకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా సమాచారం.

Exit mobile version