NTV Telugu Site icon

Karthika: పెళ్లి పీటలు ఎక్కుతున్న దమ్ము హీరోయిన్.. దర్శకేంద్రుడుకు ఆహ్వానం

Radha

Radha

Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక. సీనియర్ నటి రాధ పెద్ద కూతురిగా జోష్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కార్తీక. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, కార్తీకకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, దమ్ము లాంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో.. ఎన్టీఆర్ కు మరదలిగా.. బావగారు యూజ్ చేసుకోండి అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ త‌ర్వాత త‌మిళ హీరో జీవా – పియా బాజ్‌పాయ్‌లతో కలిసి రెండవ చిత్రం రంగంతో పెద్ద విజ‌యం అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన కార్తీక.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.

Gayathri Raghuram: అయ్యో.. బాపు బొమ్మ ఏంటీ .. ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

ఇక ఈ మధ్యనే ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను కార్తీక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కానీ, ఎక్కడా హబ్బీ ఫోటోను షేర్ చేయలేదు. ఇక పెళ్లి డేట్ దగ్గరపడుతుండటంతో కార్తీక తల్లి రాధ.. పెళ్లి పిలుపులకు బయల్దేరింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన ఆమె.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాధతో కలిసి ఉన్న వీడియోను దర్శకేంద్రుడు షేర్ చేస్తూ..” రాధ.. నిన్ను చాలాయేళ్ల తరువాత కలవడం సంతోషంగా ఉంది. ఇక మీ కూతురు పెళ్లికి నా శుభాకాంక్షలు..” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి కార్తీక పెళ్లి తరువాత నటిస్తుందో లేదో చూడాలి.

Show comments