Site icon NTV Telugu

Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే

Tollywood

Tollywood

ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ  ఒకరినొకరు పోటీ పడుతున్నారు.

నితిన్ సంగతి చూస్తే అప్పుడెప్పుడో గుండెజారి గల్లంతయిందే తర్వాత భీష్మ మాత్రమే హిట్స్. మధ్యలో డజను డిజాస్టర్స్. ఇక లేటెస్ట్ తమ్ముడు అయితే అతగాడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక ఇపుడు ఆశలన్నీ’ఎల్లమ్మ’ పైనే.

గోపీచంద్ 2014లో వచ్చిన లౌక్యం ఆయన చివరి హిట్. 10 ఏళ్ళు అయిన కూడా మరో హిట్ ఇవ్వలేదు గోపిచంద్. ఒక్కోటి దారుణామైన డిజాస్టర్స్. అయినా చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు. తప్పెవరిది నిర్మాతలదా అంటే ఎం చెప్తాం.

రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంతే. 2011లో వచ్చిన కందిరీగ తర్వాత 11 సినిమాలు చేస్తే నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్స్. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తో మేలుకున్న రామ్ కథలపై ఫోకస్ పెంచాడు. ఆంధ్ర కింగ్ తాలూకాతో కంబ్యాక్ ఇస్తానని భావిస్తున్నాడు.

వరుణ్ తేజ్ : 2018లో వచ్చిన తోలి ప్రేమ, మధ్యలో గద్దల కొండ గణేష్ తర్వాత హిట్ అనే పదానికి కిలోమీటర్ దూరంలో ఆగాడు వరుణ్. తనకు నప్పే ప్రేమ కథలు వదిలేసి యాక్షన్, మాస్ సినిమాలు చేసి మార్కెట్ ను తగ్గించుకున్నాడు.

శర్వానంద్ : మహానుభావుడు తర్వాత హిట్ అనే పదం మర్చిపోయాడు శర్వా. కానీ పారితోషకం మాత్రం పది కోట్లకు అటు ఇటుగా  తీసుకుంటాడు అనే టాక్. కొన్ని సినిమాలు అయితే కనీసం ఓపెనింగ్ కూడా రాబట్టలేదు.

బెల్లం కొండ శ్రీనివాస్ : కెరీర్ మొత్తంలో రాక్షసుడు సాలిడ్  హిట్. మిగిలిన సినిమాలు ఎంత మాత్రం అనేడి తెలిసిన విషయమే. ఒక్కో సినిమా కోట్లకి కోట్లు బడ్జెట్స్. రిజల్ట్స్ చుస్తే దారుణ పరాజయాలు. అయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు.

అల్లరి నరేష్ : వరుస వస్తున్నా టైమ్ లో నాంది తో ట్రాక్ మార్చి హిట్ కొట్టాడు. కానీ మళ్ళి మాములే. కానీ ఇతర హీరోల మాదిరి వరస్ట్ సినిమాలు అయితే చేయలేదు కానీ హిట్స్ మాత్రం లేవు. 

విశ్వక్ సేన్ : హిట్ తర్వాత హిట్టు లేని విశ్వక్ సినిమాలు అయితే చేస్తున్నాడు గాని హిట్ మాత్రం లేదు. లైలా సినిమాతో టాలీవుడ్ లో వరస్ట్ సినిమా అనే పేరు కూడా తెచ్చుకున్నాడు.

వీళ్లు మాత్రేమే కాదు కార్తికేయ, రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం, వైష్ణవ్ తేజ్, ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్ ఇలా చాలా మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం లేవు. కొందరి సినిమాలు అయితే ఓటీటీ డీల్స్ కూడా కావడం లేదు. అయినా కూడా నిర్మాతలు కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఒకరిది అవకాశం ఇంకొరిది అవసరం.

Exit mobile version