Site icon NTV Telugu

Beast: డైరెక్టర్‌పై విజయ్‌ తండ్రి ఆగ్రహం.. దాన్ని సినిమా అంటారా..?

Beast

Beast

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. సినిమా రిలీజ్ అయినప్పటినుంచి నెగటివ్ రిపోర్టులు రావడంపై ఒక ఇంటెరివ్యూ లో విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్పందించారు. కేవలం ఈ సినిమా విజయ్ స్టార్ డమ్ ను బట్టే విజయం సాధించిందని చెప్పి షాక్ ఇచ్చాడు.

” బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు పాత రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేశారో..  నేను కూడా అంటే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్‌ సినిమా కేవలం విజయ్‌ స్టార్‌డమ్‌ మీదే నడిచినట్లు ఉంది. సినిమాలో ఉగ్రవాదుల గురించి చెప్తున్నప్పుడు ఎంత పరిశోధించాలి. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపించలేదు.. అసలు దీన్ని సినిమా అంటారా ..? అని అంటున్నారు అభిమానులు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్‌ ఏం చేస్తారు? ఎలా ప్రవర్తిస్తారు..? అనేది ఇంకాస్త పరిశీలించి చూపిస్తే సినిమా ఇంకా విజయం సాధించేది. ఈ సినిమా కేవలం విజయ్ స్టార్ డమ్ ని బట్టి మాత్రమే విజయం అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version