Site icon NTV Telugu

Vijay Devarakonda : ‘టెర్రరిస్ట్ నా కొడుకులకు బ్రెయిన్ ఉండదు’.. విజయ్ ఫైర్..

Vijay Devarakomda

Vijay Devarakomda

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్‌ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్ లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా.. దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకు ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే టెర్రరిస్టులకు బ్రెయిన్ ఉండదు. నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే. కశ్మీర్ లో ఉన్న వాళ్లు మనవాళ్లే. కశ్మీర్ వాళ్లతో మంచి అనుబంధం ఉంది.
Read Also : Off The Record: తెలంగాణ బీజేపీ ట్రయల్‌ రన్‌ ఫెయిలైందా?

నేను ఖుషి సినిమా కశ్మీర్ లో చేసినప్పుడు అక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పడింది. కానీ టెర్రరిస్టులు ఇలాంటివి చేసి ఆ అనుబంధాన్ని చెడగొడతున్నారు. మన ఇండియా వెళ్లి పాకిస్థాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ప్రజలే విరక్తి పుట్టి అక్కడి ప్రభుత్వంపై తిరగబడతారు. ఇలాంటి పనులు చేస్తే పాకిస్థాన్ ప్రజలే తిరగబడతారు. టెర్రరిస్టులు ఇండియాలో ఏం చేస్తారు. పాక్ లో కరెంట్ లేదు, నీరు లేదు. ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు’ అంటూ ఫైర్ అయ్యారు విజయ్ దేవరకొండ. అనంతరం రెట్రో సినిమా మంచి విజయం సాధించాలని విజయ్ కోరారు.

Exit mobile version