టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గరనుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ప్రతిరోజూ ఆమె గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఇటీవల ఆమె విడాకుల గురించి ఒక ఆంగ్ల మీడియాలో నోరు విప్పిన సంగతి తెలిసిందే.. అభిమానులు ఎంతోమంది ట్రోల్ చేసినా.. తాను స్ట్రాంగ్ గా ఉన్నానని, విడాకుల తరువాత చనిపోతానేమో అనుకున్నా కానీ తానూ బలహీనురాలిని కాదని చెప్పుకొచ్చింది. ఇక వీటిపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడంపై కూడా ఆమె స్పందించింది. ” నేను ఏం చేసినా అందరు అంగీకరించాలని అనుకోను.. ఎవరి మనస్తత్వాలు వారివి.. విభిన్నమైన మనస్తత్వం ఉన్నవారిని కూడా నేను ప్రోత్సహిస్తాను.. కానీ వారి నుంచి నేను ఒకటే ఆశిస్తాను.. నా పనులు నచ్చకపోతే .. కొంచెం నాగరికంగా చెప్పాలని కోరుకొంటాను” అని చెప్పుకొచ్చింది. అంటే ట్రోల్స్ లా కాకుండా ఫ్యాన్స్ లా ఆమె తప్పును తెలియచెప్పవచ్చు అని చెప్పింది.
ఇక తాజగా ఈ ట్వీట్ కి కౌంటర్ గా హీరో సిద్దార్థ్ మరో ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. “ఈ విషపూరితమైన ఎకో సిస్టమ్ లో ని చాలామంది కోట్లు ధారపోసి ఫ్యాన్స్ గ్రూప్స్ ని పోషిస్తున్నారు. వారిని ఆయుధాలుగా మార్చుకొని కొన్ని పనులను నిర్వహిస్తున్నారు.. ఏది దానంతట అది జరగదు.. ఎన్ని కోట్లు ఇచ్చి పోషించినా ఫ్యాన్స్ కూడా వారిని కాటేస్తారన్న విషయం స్టార్స్ అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే వారిని పెంచి పోషిస్తుంది స్టార్సే కాబట్టి.. ఇలా ప్రేమను , ద్వేషాన్ని కొనుక్కోవడం ఆపేయండి” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్ సామ్ ఇంటర్వ్యూ కి కౌంటర్ అన్నట్లు అభిమానులు తెలుపుతున్నారు. మొదటి నుంచి మా జంటను దీవించండి .. మా ప్రేమను అంగీకరించండి అని పబ్లిసిటీ చేసుకొని ఇప్పుడు విడిపోయినప్పుడు ద్వేషించకండి అంటే ఫ్యాన్స్ ఆగుతారా ..? అని సిద్దు ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేశాడని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఇకపోతే సామ్ విడాకులు తీసుకున్నాకా కూడా సిద్దూ ”మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు” అంటూ ట్వీట్ చేసి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి.