పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ మూవీస్ నుంచి అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక సినిమా అప్డేట్, గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ ఇంకో సినిమా అప్డేట్… ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఖుషి చేస్తూనే ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్నీ కలిపి ఎంత హైప్ ఇస్తున్నాయో, ఆ హైప్ ని మించేలా మరిచిపోయేలా ఒక్క సినిమా కిక్ ఇస్తూనే ఉంది. పంజా సినిమా వైబ్స్ ని ఇస్తున్న గ్యాంగ్ స్టార్ డ్రామా ‘OG’, పవన్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫెవరెట్ హీరోని ఏ రేంజులో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫాన్స్ ‘OG’పై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు OG విషయంలో ఏం జరుగుతుంది, ఎంతవరకు షూటింగ్ అయ్యింది అనేది ఫాన్స్ కి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న OG అక్కడ ఒక ఫైట్ అండ్ ఒక సాంగ్ షూట్ జరుపుకుంది. హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ కూడా ముంబై షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్ అయిపోగానే టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా OG గురించి మరో అప్డేట్ ఇచ్చారు. ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత OG సెకండ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. ఇంత స్పీడ్ గా, ఇంత యాక్టివ్ గా ఈ మధ్య కాలంలో ఏ ప్రొడక్షన్ హౌజ్ కూడా ఫాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో పవన్ ఫాన్స్ డీవీవీ బ్యానర్ పై కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. డీవీవీ నుంచి ట్వీట్ రావడంతో సోషల్ మీడియాలో OG టాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి తోడు ఈరోజు #PKSDT టైటిల్ అనౌన్స్మెంట్ ఉండడంతో ఆ టాగ్ ని కూడా ట్రెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు.
After a blazing Mumbai schedule, #OG has begun its second schedule in Hyderabad today. ⚡️#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥
— DVV Entertainment (@DVVMovies) May 18, 2023