Site icon NTV Telugu

Hello World: ‘లీలామహల్ సెంటర్’ జోడీని కలిపిన నిహారిక!

Nihariki

Nihariki

ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్‌ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

Nihariki2

మంగళవారం ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగింది. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు ఆమె తల్లి కూడా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జీ5 కోసం నిహారిక నిర్మిస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. గతంలో ఆమె ‘నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ని ప్రొడ్యూస్ చేసింది. అలానే ఆర్యన్ రాజేశ్ గతంలో జీ 5 రూపొందించిన ‘ఎక్కడికీ ఈ పరుగు’లో నటించాడు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ‘హలో వరల్డ్’కు ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ నితిన్, నిఖిల్, సుదర్శన్, అనీల్ గేలా, నయన్ కరిష్మ, అపూర్వ అల్లా, నిత్యాశెట్టి, స్నేహల్ కామత్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.

Exit mobile version