Hello World: ‘లీలామహల్ సెంటర్’ జోడీని కలిపిన నిహారిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

Nihariki2
Also Read
మంగళవారం ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగింది. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు ఆమె తల్లి కూడా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జీ5 కోసం నిహారిక నిర్మిస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. గతంలో ఆమె ‘నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ని ప్రొడ్యూస్ చేసింది. అలానే ఆర్యన్ రాజేశ్ గతంలో జీ 5 రూపొందించిన ‘ఎక్కడికీ ఈ పరుగు’లో నటించాడు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ‘హలో వరల్డ్’కు ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ నితిన్, నిఖిల్, సుదర్శన్, అనీల్ గేలా, నయన్ కరిష్మ, అపూర్వ అల్లా, నిత్యాశెట్టి, స్నేహల్ కామత్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!