Site icon NTV Telugu

Adipurush Pre Release Event: బిగ్ బ్రేకింగ్.. తిరుపతిలో భారీ వర్షం.. అయోధ్య సెట్ కు కవర్

Tirupathi

Tirupathi

Adipurush Pre Release Event: మరికొద్దిసేపటిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకానుంది. ఎప్పుడెప్పుడు స్టేజిపై ప్రభాస్ కనిపిస్తాడా..? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ కోసం గ్రాండ్ ఎంట్రీ. ఈవెంట్ కోసం అయోధ్య సెట్ .. 100 మంది సింగర్లతో ఆదిపురుష్ సాంగ్స్, రామాయణం సాంగ్స్ పాడించనున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ బ్రదర్స్.. లైవ్ కన్సర్ట్ చేయనున్నారు.. ఇక ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగేలా కనిపించడం లేదు. అందుకు కారణం వరుణుడు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఒక మోస్తరుగా ఉండడంతో వర్షం పడుతుంది అనుకోలేదు. కానీ, సడెన్ గా తిరుపతి లో వర్షం మొదలయ్యింది. చిన్న చిన్న చినుకులే కాబట్టి.. అంత భయపడాల్సిన పనిలేదు.. కానీ, పెద్ద వర్షం పడితే పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Adipurush: ఆదిపురుష్ ‘అయోధ్య’ సెట్ చూశారా ..?
ఇక ఈ విషయమై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. కంగారు పడాల్సిన పని లేదని, వర్షం పడదని చెప్పుకొచ్చాడు. ఆ చినుకులు దేవుడు మాపై చినుకుల రూపంలో ఆశీర్వాదాలు పంపిస్తున్నాడు అని అన్నారు. చుట్టూ దేవుళ్ళు ఉన్న కొండ మధ్యలో ఉన్నాం.. అన్ని ఆయనే చూసుకుంటారు అని నమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఈ చినుకులు.. కేవలం పాసింగ్ క్లౌడ్స్ అని తీసిపారేశారు. అయితే ఉన్నకొద్దిగా వర్షం పెద్దది కావడంతో అయోధ్య సెట్ పైన కవర్లు కప్పుతున్నారు.
అయితే అభిమానుల్లో మాత్రం ఈ వరుణ గండం ఆందోళన తెప్పిస్తుంది. ఏదిఏమైనా ప్రభాస్ కోసం డార్లింగ్స్ తుడుచుకుంటూ నిలబడమన్న నిలబడతారు. మరి ఈ ఈవెంట్ మొదలయ్యేసరికి వరుణుడు సైడ్ అవుతాడా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version