He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లార్జర్-ద్యాన్-లైఫ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ (He-Man and the Masters of the Universe) ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ తెలుగు ట్రైలర్ టాలీవుడ్ ఆడియన్స్‌కు ఒక అదిరిపోయే క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు తెలుగులో టాలీవుడ్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే మ్యాజిక్ ‘హీ-మ్యాన్’ చిత్రానికి రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో వీరుడు ‘హీ-మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో, ‘కార్తికేయ 2’ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) తెలుగులో తన పవర్ఫుల్ వాయిస్ అందించారు. నిఖిల్ మార్క్ బేస్ అండ్ ఎనర్జీ ఈ హాలీవుడ్ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అయ్యింది. కేవలం హీరో పాత్రకే కాకుండా, ఈ సినిమాలో ఉన్న ఇతర కీలక పాత్రలకు కూడా టాలీవుడ్ టాప్ పర్ఫార్మర్లను రంగంలోకి దించింది సోనీ పిక్చర్స్. హాలీవుడ్ వర్షన్లో జారెడ్ లెటో పోషించిన ఈ మోస్ట్ పవర్ఫుల్ అండ్ క్రూరమైన విలన్ పాత్రకు తెలుగులో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ (Aditya Menon) తన గంభీరమైన వాయిస్‌ను అందించారు.
Also Read
- Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
- Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
- Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
అలాగే కథలో అత్యంత కీలకమైన మ్యాన్-అట్-ఆర్మ్స్ ‘డంకన్’ (ఇడ్రిస్ ఎల్బా పాత్ర) కు టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ (Rao Ramesh) డబ్బింగ్ చెప్పడం ఈ తెలుగు వర్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పవర్ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ (Eternia) అనే సరికొత్త ఊహాజనిత ప్రపంచంలో జరిగే యాక్షన్, ఎమోషన్, మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ అంశాలు తెలుగు ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ కానున్నాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది.అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ (Amazon MGM Studios) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు ట్రావిస్ నైట్ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే నెల (జూన్) 5వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్,మలయాళ భాషల్లో ఈ చిత్రం భారతదేశమంతటా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!