Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Haunman Producer Niranjan Reddy Exclusive Interview

Niranjan Reddy: హనుమాన్ లాంగ్ రన్ ఉండే సినిమా.. బాలీవుడ్ లో బిగ్గర్ రిలీజ్.. కానీ తెలుగులో మాత్రం?

Published Date :January 4, 2024 , 5:42 pm
By Bhargav Chaganti
Niranjan Reddy: హనుమాన్ లాంగ్ రన్ ఉండే సినిమా.. బాలీవుడ్ లో బిగ్గర్ రిలీజ్.. కానీ తెలుగులో మాత్రం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hanuman Producer Niranjan Reddy Exclusive Interview: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత కె నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హనుమాన్ విశేషాలు పంచుకున్నారు.

నిర్మాతగా ఇది మొదటి సినిమా కదా.. ఈ అనుభవం ఎలా వుంది ?
చాలా ఆనందంగా ఉంది, మొదటి సినిమానే ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడం, అది కూడా సంక్రాంతికి రావడం సంతోషంగా వుంది. హను మాన్.. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన సూపర్ హీరో జానర్ మూవీ. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ వున్నారని మనం నమ్ముతాం ఆయన మన రియల్, యూనివర్సల్ సూపర్ హీరో. ఆంజనేయ స్వామిని ఎలా చూద్దామని అనుకుంటారో ఈ సినిమా చూసి బయటకు వచ్చినపుడు అది ఫుల్ ఫిల్ అవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఆనందంగా ఫీలవుతారు.

హనుమాన్ ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువయిందని విన్నాం ? ఇంత నమకాన్ని ఇచ్చిన కంటెంట్ ఏమిటి ?
అవునండీ.. ఐదారు రెట్లు పెరిగింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్. ఈ కథ చెప్పినప్పుడే గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మార్వెల్ -డీసిలా మన ఇండియన్ సినిమాకు ఒక ఫ్రాంచైజ్ లేదు. అలా మనకు ఒక ఫ్రాంచైజ్ ఉండాలని హనుమాన్ చేశాం. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇది పెద్దది అవుతుందనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేస్తూ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కేవలం థియేట్రికల్ గా 20 కోట్లు జరిగింది. మాకున్న స్టార్ కాస్ట్ కి ఇది హ్యూజ్ నెంబర్. ఓవర్సిస్, కర్ణాటక, నార్త్ ఇండియాతో పాటు నాన్ థియేట్రికల్ లో చాలా మంచి బిజినెస్ జరిగింది. కంటెంట్ పై మాకు ఉన్న నమ్మకం ఈ రోజు నిజమైంది.

సంక్రాంతికి దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి కదా..? ఈ పోటీ ప్రభావం సినిమాపై ఎలా ఉంటుంది?
హనుమాన్ ప్రాజెక్ట్ వరకు విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి సినిమాలా మొదటి రోజులు కోసం మేము చూడటం లేదు. చాలా లాంగ్ రన్ ఉండే చిత్రమిది. కంటెంట్ బావుంటే లాంగ్ రన్ ఉంటుంది. బేబీ, బలగం సినిమాలు దీనిని నిరూపించాయి. మా సినిమా కూడా అలా లాంగ్ రన్ వుండే చిత్రం.

హను మాన్ గ్లోబల్ సక్సెస్ అయ్యే చిత్రమని మీకు ఎప్పుడనిపించింది ?
టీజర్ విడుదలైన తర్వాత ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది, ఎందుకంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు. అప్పుడే ఇది గ్లోబల్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ కంటెంట్ కు కావాల్సిన ప్రతిది ఎక్కాడా రాజీపడకుండా సమకూర్చాలని నిర్ణయించుకున్నాం.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాల్లో మీ భాగస్వామ్యం ఉంటుందా ?
వంద శాతం ఉంటుంది. ప్రశాంత్ కి కూడా ఈ విషయం చెప్పా, అయితే ఆయన ప్రణాళిలు ఎలా ఉంటాయో కూడా చూడాలి కదా.

మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి ?
మా నాన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మాది నల్గొండ. అయితే నేను మాత్రం హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. సినిమా అంటే ప్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చాను. చాలా ప్యాషన్ తో చేసిన ‘హనుమాన్’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మా బ్యానర్ నుంచి మున్ముందు వచ్చే చిత్రాలన్నీ కంటెంట్ బేస్డ్ గానే వుంటాయి. 25 ఏళ్ల పాటు సినీ నిర్మాణ రంగంలో వుండాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి వచ్చా.

బాలీవుడ్ లో ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి?
చాలా బాగున్నాయ్ అండీ. ట్రైలర్, టీజర్ కి ఆడియన్స్ నుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 200 స్క్రీన్స్ లో చాలా బిగ్గర్ రిలీజ్ చేస్తున్నాం. బాలీవుడ్ లో చాలా పెద్ద రన్ ఉంటుంది.

వీఎఫ్ఎక్స్ గురించి ?
హనుమాన్ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత్ వర్మ విజన్ కి తగినట్లు వీఎఫ్ఎక్స్ అవుట్ పుట్ వచ్చింది. ఖర్చు చేసిన ప్రతిది తెరపై కనిపిస్తుంది.

చిరంజీవి గారు హనుమాన్ లో వున్నారా లేదా ?
అది సర్ప్రైజ్. సినిమాలో ఎన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయానేది తెరపై చూసినప్పుడే తెలుస్తుంది (నవ్వుతూ) చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు.

రవితేజ గారి వాయిస్ ఓవర్ గురించి ?
ఇందులో కోటి అనే సర్ప్రైజ్ రోల్ వుంది. దీనికి రవితేజ గారు వాయిస్ ఓవర్ చెప్పారు. ఇందుకు రవితేజ గారికి థాంక్స్ కంటే పెద్ద మాట చెప్పాలి. ఆయన సినిమా వుండి కూడా ఈ కాంపిటేషన్ లో సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. పరిశ్రమ ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీనే ఆశిస్తుంది.

హనుమాన్ ఎలా ఉండబోతుంది ?
హనుమాన్ ట్రైలర్ అందరికీ అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ కంటే పది రెట్లు అద్భుతంగా ఉంటుంది సినిమా. వందశాతం ప్రేక్షకులకు నచ్చుతుంది.

అమృత అయ్యర్, వరలక్ష్మీ పాత్రలు ఎలా ఉంటాయి ?
అమృత అయ్యర్, వరలక్ష్మీ పాత్రలు కథలో చాలా బలంగా వుంటాయి. ఆడియన్స్ ఆ పాత్రలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.

హాను మాన్ బజ్ కి తగ్గ థియేటర్లు దొరకడం లేదనే మాట వినిపిస్తోంది ?
ఈ చిత్రం కోసం దాదాపు మూడేళ్ళు కష్టపడ్డాం. మేము విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ కూడా సంక్రాంతి మా సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నారు. దానికి తగినట్లు హనుమాన్ ని స్పెషల్ ఫిల్మ్ గా కన్సిడర్ చేసి సపోర్ట్ ఇవ్వండనేది మా కోరిక. నాలుగు సినిమాలు వస్తున్నపుడు స్కేల్, బజ్ కి తగ్గట్టు సినిమాకి థియేటర్స్ కేటాయింపు ఇవ్వాలనేదే మా విన్నపం.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
మా బ్యానర్ నుంచి ఫిబ్రవరిలో మల్టిపుల్ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ వుంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hanuman Producer
  • Hanuman Producer Niranjan Reddy
  • Hanuman Producer Niranjan Reddy Exclusive Interview
  • Niranjan Reddy Exclusive Interview

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions