Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar DVV Danayya BVSN Prasad Visits Janasena Party Office: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు విచ్చేశారు. పవన్ చేపట్టిన యాగంలో పాల్గొన్న దేవీ దవతలను వీళ్లు దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత.. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, షూటింగులు చేయాలనే అంశంపై పవన్‌తో వాళ్లు చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇదే సమయంలో.. దర్శకనిర్మాతలు కొన్ని లొకేషన్లను కూడా పరిశీలించారు.
Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Also Read
ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. జూన్ 14వ తేదీ నుంచి వారాహి యాత్ర చేపడుతున్న పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక పరివర్తన, లోకకళ్యాణం కోసం పవన్ చండీ హోమం జరిపారని.. తాము దైవదర్శనం కోసం వచ్చామని అన్నారు. తామంతా తొలిసారి మంగళగిరికి వచ్చామన్నారు. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని.. పవన్ కళ్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను కూడా ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. ఆల్రెడీ రాజమండ్రి, వైజాగ్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతున్నాయని.. ఇకపై బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లోనూ షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామని వెల్లడించారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయన్నారు.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్నీ జరిగేది ఇక అక్కడేనా..?
అనంతరం డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. జూన్ 14 నుంచి వారాహి యాత్ర చేపడుతుండటంతో పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయంలో చండీహోమం చేపట్టారని, ఈ సందర్భంగా తాము దైవదర్శనం చేసుకోవడానికి వచ్చామని చెప్పారు. హరీశ్ శంకర్ చెప్పినట్టు.. తాము ఏపీలోని మంగళగిరి, బెజవాడ ప్రాంతాల్లో రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని.. తాము చెప్పాల్సిందంతా హరీశ్ శంకర్ చెప్పారని అన్నారు. కాగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!