Harish Rao: ఇండియన్ ఐడల్ రన్నరప్ గా సిద్దిపేట ముద్దుబిడ్డ.. ప్రశంసించిన హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ప్రముఖ ఆహా ఓటిటీలో మొట్ట మొదటి సారి సింగింగ్ కాంపిటేషన్ జరిగిన విషయం తెల్సిందే. ఇండియన్ ఐడల్ తెలుగు అనే పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్లు తమ సత్తాను చాటారు. మొదటి సీజన్ ను ఎంతో విజయవంతంగా పూర్తిచేసిన ఆహా.. ఇప్పుడు సీజన్ 2 ను కూడా అంతే విజయవంతంగా పూర్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతామాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. ఇక ఈ సీజన్ ఫినాలేకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన.. సౌజన్య, జయరాం, లాస్యప్రియ, శృతి, కార్తికేయ పోటాపోటీగా పాడిన తీరు ఆకట్టుకుంది. చివరికి సీజన్ 2 విన్నర్ గా సౌజన్య నిలువగా.. రన్నర్ గా లాస్యప్రియ నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట యువతీ కావడంతో మంత్రి హరీష్ రావు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
Sudigali Sudheer: ‘గాలోడు’ రేంజ్ మాములుగా పెరగలేదు.. చిత్రమ్మనే రంగంలోకి దింపేశాడుగా
Also Read
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
“ఇండియన్ ఐడల్ తెలుగు -2023.. సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు 💐
భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆయనతో పాటు తెలంగాణకు మంచి పేరు తెచ్చినందుకు ప్రతి ఒక్కరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇండియన్ ఐడల్ తెలుగు -2023
సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు 💐
భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్… pic.twitter.com/MgL1iOPV36— Harish Rao Thanneeru (@BRSHarish) June 5, 2023
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!