ట్రెండింగ్‌లో త్రివిక్రమ్ ట్వీట్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ఏపీ రాజకీయాలలో మోత మోగిపోతుంది. ఇదేంటి త్రివిక్రమ్ రాజకీయాలలో ఎప్పుడు చేరాడు.. ఎవరిని ఏమి అన్నాడు అని కంగారు పడకండి. ఆయన ఏమి అనలేదు.. ఒక చిన్న పొరపాటు ఆయనను కూడా ఈ రాజకీయాలలోకి లాగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన ట్వీట్ గురించి కూడా జగన్ తో మాట్లాడతానని తెలిపారు. త్రివిక్రమ్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్లుగానే ప్రతి స్కూల్లోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్యా, వైద్యం కంటే సినిమా ఎక్కువా?” అంటూ త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అంతేకాకుండా అయన మాట్లాడిన అంశం గురించి కూడా జగన్ కి చేరవేస్తానని, తన పని అదేనని చెప్పుకొచ్చారు.
అయితే నిజంగా చెప్పాలంటే అసలు త్రివిక్రమ్ కి ట్విట్టర్ అకౌంటే లేదు. అది ఒక ఫేక్ అకౌంట్.. అయితే తాజాగా ఈ ట్వీట్ గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్పందించింది. త్రివిక్రమ్ కి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని, ఆయన సంబంధించిన ఏవైనా అధికారిక ప్రకటనలు తమ నిర్మాణ సంస్థ లేదా తన నుంచే వస్తాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ” త్రివిక్రమ్ కి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు.. ఆయన పేరు, ఫోటో పెట్టి ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చే వార్తలను నమ్మకండి” అంటూ తెలిపారు.
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
Any official statements from #Trivikram garu will only come from @haarikahassine & @Fortune4Cinemas
He doesn't have any social media presence. Please don't believe in any comments made by various profiles bearing his pic/name.@AndhraPradeshCM @perni_nani @IPR_AP
— Haarika & Hassine Creations (@haarikahassine) November 27, 2021
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!