NTV Telugu Site icon

Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్‌’ విలన్ పెళ్ళి!

Hari

Hari

Vasishta N Simha: హరిప్రియ… కన్నడలో స్టార్ హీరోయిన్. అంతేకాదు అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. మూడు పదుల ఈ ముద్దమందారం చిన్నప్పుడే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆ తర్వాత మోడలింగ్ మీదుగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2008లో కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హరిప్రియ… ప్రముఖ నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన ‘పిల్ల జమిందార్’లో యాక్ట్ చేసింది. అలానే వరుణ్ సందేశ్ కు ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ మూవీలో జోడీ కట్టింది. ఇందులో ఆమెది కాల్ గర్ల్ క్యారెక్టర్ కావడం విశేషం. కాస్తంత గ్యాప్ తర్వాత బాలకృష్ణ ‘జైసింహా’తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది.


విశేషం ఏమంటే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు కన్నడ నటుడితో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. అతను మరెవరో కాదు… సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్‌’లో వన్ ఆఫ్‌ ది విలన్స్ గా నటించిన వశిష్ఠ ఎన్. సింహా. కన్నడంలో పలు చిత్రాలలో నటించిన వశిష్ఠ ‘కేజీఎఫ్‌’ పుణ్యమా అని ఇప్పుడు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరికీ మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురించిందో తెలియదు. కానీ… శుక్రవారం నిరాడంబరంగా వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని బహిర్గతం చేశారు. మరి వీరిరువురూ పెళ్ళి పీటలు ఎప్పుడు ఎక్కుతారో చూడాలి.

Show comments