HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న థియేటర్లలోకి వచ్చింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే సినిమా ఓటీటీ డేట్ ను తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. మూవీని అమేజాన్ ప్రైమ్ లో ఆగస్టు 20 నుంచి అంటే రేపటి నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ కోసం చాలా మంది ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్ కల్యాన్ ధర్మకర్తగా సాగించిన ప్రయాణం చాలా మందిని మెప్పించింది. కానీ కథ ఎమోషన్ పరంగా కొంత డిసప్పాయింట్ మెంట్ చేసింది. పవన్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ తో వచ్చింది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..
రెండో పార్టు షూటింగ్ కూడా కొంత వరకు జరిగిందని మూవీ టీమ్ ఇప్పటికే తెలిపింది. రెండో పార్టులో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే ఉంది. ప్రస్తుతానికి మూవీ టీమ్ రెండో పార్టుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది. చాలా సినిమాలు థియేటర్లలో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో అలరిస్తుంటాయి. ఎందుకంటే థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులు ఆలోచనలు ఒకలా ఉంటే.. ఓటీటీలో చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ ఒకలా ఉంటోంది. మరి వీరమల్లు ఓటీటీలో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Read Also : Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ సూపర్ అంతే..
