HHVM : ట్రైలర్ తో వాటికి సమాధానం చెప్పిన వీరమల్లు..
- పవన్ కల్యాణ్ సత్తా చూపించాడా
- ట్రైలర్ కు భారీ రెస్పాన్స్
- వాటన్నింటికీ చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : హరిహర వీరమల్లు సినిమాపై చాలా రకాల అనుమానాలు మొన్నటి దాకా వినిపించాయి. మూవీ మొదలై ఐదేళ్లు అయింది.. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లు బాగా రాలేదని పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరకొరగా షూటింగ్ జరిగిందని టాక్. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా మైనస్ పాయింట్. పైగా పవన్ కూడా ఈ సినిమా గురించి ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అటు ఫ్యాన్స్ లో ఇటు సాధారణ ప్రేక్షకుల్లో దీనిపై రకరకాల అనుమానాలు పెరిగిపోయాయి.
Read Also : HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
Also Read
- Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. 'ప్రభాస్' గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
వాటన్నింటికీ ఒక్క ట్రైలర్ తోనే సమాధానాలు దొరికేసినట్టు అయింది. మూవీ ట్రైలర్ అనుకున్నదానికంటే బాగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు, పోస్టర్లలో ఈ స్థాయి విజువల్స్ కనిపించలేదు. కానీ ట్రైలర్ తోనే అసలు తమ సినిమా ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా హైప్ పెంచేశారు. ఈ విషయంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. అందులో నో డౌట్. హరిహర వీరమల్లు మూవీ ఒక ధర్మవీరుడి కథ అని ట్రైలర్ తో చెప్పడమే కాకుండా.. ధర్మం కోసం ఏ స్థాయిలో పోరాడాడో చూపించారు. యాక్షన్ సీన్లు, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ అదిరిపోయాయి. దెబ్బకు 24 గంటల్లోనే భారీ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాను ఊపేసింది. మొన్నటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే రిజల్ట్ మూవీ రిలీజ్ రోజు ఉంటే మాత్రం కలెక్షన్ల వరద పారుతుందనే చెప్పుకోవాలి.
Read Also : Allu Aravind : అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం..
తాజావార్తలు
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!