Site icon NTV Telugu

HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!

Hhvm

Hhvm

HHVM vs Kingdom : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్‌ సినిమా వస్తోంది. మరి సందడి మామూలుగా ఉండదు కదా. అసలే పోటీ కూడా లేదు. సోలోగా రిలీజ్ అవుతోంది. దీనికి ముందు థియేటర్లలో ఆడుతున్న పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో 90 శాతం థియేటర్లలో హరిహర వీరమల్లును వేస్తున్నారంట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి. ఇక విలేజ్ లలో ఉండే సింగిల్ థియేటర్లు అన్నీ వీరమల్లుకే ఇచ్చేస్తున్నారంట. ఉత్తరాంధ్రలో 150 థియేటర్లు ఉండే ఇందులో 135 థియేటర్లలో వీరమల్లు సినిమానే వేస్తున్నట్టు టాక్. ఇదే ఇప్పుడు కింగ్ డమ్ ను అయోమయంలో పడేసింది.

Read Also : Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..

ఒక్క ఉత్తరాంధ్రలోనే కాకుండీ సడెడ్, నైజాంలోనూ వీరమల్లుకే మెజార్టీ థియేటర్లు ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత జులై 31న వస్తున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీకి థియేటర్లు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అప్పటికే వీరమల్లు రిలీజ్ అయి వారం రోజులే అవుతుంది కాబట్టి.. టాక్ బాగుంటే ఇవ్వడం కష్టమే. ఒకవేళ టాక్ అటుఇటుగా ఉంటే ఏమైనా థియేటర్లు ఖాళీ అవ్వొచ్చు. కానీ ఓపెనింగ్స్ కోసం అయినా థియేటర్లు వీరమల్లు నుంచి 50 శాతం అయినా ఇవ్వాలి. అది జరిగే పనేనా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ సినిమాను తీసేసి కింగ్ డమ్ మూవీని వేస్తే జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బయ్యర్లు, ఎగ్జిబిటర్ల నుంచి కింగ్ డమ్ నిర్మాత నాగవంశీ డీల్ చేసుకోవాలి. అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి ప్రమోషన్లలో బిజీగా ఉంది టీమ్. మరి వీరమల్లు నుంచి కింగ్ డమ్ కు థియేటర్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.

Read Also : Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..

Exit mobile version