Site icon NTV Telugu

HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?

Hhvm

Hhvm

HHVM : పవన్ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్‌ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రిస్కులే తీసుకుంటున్నాడు. మూవీ కంటెంట్ బాగుందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే రివ్యూలు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి మరీ ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించాడు. దీని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలే పవన్ కు రాజకీయ శత్రువులు చాలా ఎక్కువ. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మూవీ గురించి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రీమియర్ షోలు అంటే రిలీజ్ రోజు నాడే వీరమల్లు మూవీ గురించి చాలా లీకులు బయటకు వచ్చేస్తాయి.

Read Also : Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..

దాంతో పాటు మూవీ టాక్ పై కూడా రకరకాల ప్రచారాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే పుష్ప-2 తర్వాత పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలు వేయట్లేదు. డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఇన్ని రోజుల తర్వాత వీరమల్లు విషయంలో ఇదంతా అవసరమా అనే టాక్ నడుస్తోంది. ఇంకోవైపేమో కంటెంట్ బాగుంటే ప్రీమియర్స్ ద్వారా ఓపెనింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. పవన్ కల్యాణ్‌ కు ఉన్న స్టార్ డమ్ దృష్ట్యా ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే కలెక్షన్లు కచ్చితంగా పెరుగుతాయి. కానీ ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా ట్రోల్స్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మరి ప్రీమియర్స్ తో వీరమల్లు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Read Also : Coolie : హైదరాబాద్ లో ‘కూలీ’ ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే..?

Exit mobile version