HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరేమో ఏపీలో నిర్వహిస్తారని చెబుతుంటే.. ఇంకొందరు హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈవెంట్ ను వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మూవీకి బజ్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మూవీని యూపీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారంట.
Read Also : Sonakshi Sinha : అతని వల్లే నేను ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు.. స్టార్ హీరోయిన్ రిప్లై
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్ గా వస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జులై 17న వారణాసిలో ఒక ఈవెంట్ ను నిర్వహించిన తర్వాత.. జులై 19న తిరుపతిలో నిర్వహించే రెండో ఈవెంట్ కు సీఎం చంద్రబాబు నాయుడు వస్తారని తెలుస్తోంది. యూపీలో జరిగే ఈవెంట్ కు యూపీ సీఎంతో పాటు భోజ్ పురి మంత్రులు వస్తారంట. తిరుపతి ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కనీ వినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంట. ఈ రెండు ఈవెంట్లతో అటు నార్త్ ఇండియాను, ఇటు సౌత్ ఇండియాను కవర్ చేయబోతున్నారంట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Also : Venkatesh : వెంకీ సరసన ఆ క్రేజీ బ్యూటీ..?