HBD Anantha Sriram : పసందైన పదబంధాలతో అనంత్ పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం)
మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఎలా ఉండబోతోందో కానీ, అందులోని “కళావతి…” పాట మాత్రం జనం మదిని గిల్లేస్తోంది. అందులోని “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. ఆ విధంగా పద రచన చేసిన ఘనుడు అనంత్ శ్రీరామ్. ప్రస్తుతం అనంత్ శ్రీరామ్ పదబంధాలతో పలు పాటలు అనేక చిత్రాలలో చోటు చేసుకొని జనాన్ని పరవశింప చేస్తున్నాయి. ‘బాహుబలి’ మొదటి భాగంలో ‘పచ్చబొట్టు…’ పాటతో జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాడు అనంత్ శ్రీరామ్. ఇప్పటికీ ప్రేక్షకులను అలరించే చిత్ర విచిత్ర ప్రయోగాల కోసం అనంత్ శ్రీరామ్ మది తపిస్తూనే ఉంది. తొలి చిత్రం ‘కాదంటే అవుననిలే’ టైటిల్ లోనే పింగళి వారి పదవిన్యాసం కనిపించడంతో అనంత్ కూడా హుషారుగా కలాన్ని పరుగులు తీయించాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దాదాపు వేయి పాటలు అనంత్ శ్రీరామ్ కలం నుండి జాలువారి జనాన్ని మెప్పించాయి.
చేగొండి అనంత్ శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8న జన్మించాడు. శ్రీరామ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డపట్ల. ఆయన కన్నవారు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. అనంత్ శ్రీరామ్ తండ్రి సత్యనారాయణకు మాజీ మంత్రి, చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య సమీపబంధువు. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ శ్రీరామ్ చిత్రసీమలో అడుగు పెట్టాడు.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశాడు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి. అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు, యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు. తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపించేవాడు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నాడు. ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన ‘ఎ లవ్, అన్ కండిషనల్’ రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన పెంచే ప్రయత్నం చేస్తుంటాడు అనంత్ శ్రీరామ్.
కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించాడు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మరిన్ని మంచి పాటలతో అనంత్ జనాన్ని మరింతగా ఆకట్టు కుంటారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!