Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..

  • వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘‘హనుమాన్ అంశ్’’..
  • రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన లో-బడ్జెట్ మూవీ..
  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సినిమాకు ట్యాక్స్-ఫ్రీ..
Hanuman Ansh

Hanuman Ansh

Hanuman Ansh: బాలీవుడ్ లో-బడ్జెట్ మూవీ ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్లలో దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తోంది. కేవలం రూ. 2 కోట్లతో నిర్మితమైన హనుమాన్ అంశ్ ఇప్పటికే రూ. 100 కోట్లు వసూలు చేసింది. నికర వసూళ్లు రూ.89 కోట్లకు చేరుకున్నాయి. ప్రతీ రోజూ కూడా కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. కలియుగంలో హనుమాన్ అవతారంగా చెప్పబడే నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వీక్షించారు. శుక్రవారం సినిమా చూసిన తర్వాత ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా ‘‘హనుమాన్ అంశ్’’ సినిమాను ట్యాక్స్-ప్రీగా ప్రకటించారు. ఇది ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి అందంగా చూపించిందని, ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూడాలని కోరారు.