Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్‌కు గూస్బంప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman 3D: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా మార్కెట్లో మరో మెట్టుకు తీసుకెళ్లిన చిత్రాల్లో ‘హను-మాన్’ ఒకటి. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి పూర్తిగా 3D వెర్షన్‌తో మరింత అద్భుతమైన విజవల్స్ తో జూన్ 25న మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఆదివారం రిలీజ్ చేసిన 3D ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అసలు ఈ 3D వెర్షన్లో ఏమి కొత్తగా ఉండబోతోంది? ప్రేక్షకులు ఎందుకు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
రీ రిలీజ్‌కు ముందు చిత్రబృందం మీడియా ప్రతినిధులు, అభిమానుల కోసం ప్రత్యేకంగా 3D ట్రైలర్‌తో పాటు ఎనిమిది నిమిషాల షోరీల్‌ను ప్రదర్శించింది. ఈ ప్రత్యేక ప్రదర్శన చూసినవారు 3D కన్వర్షన్ క్వాలిటీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ భారీ విజువల్ స్కేల్ ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా పేరు తెచ్చుకున్న ‘హను-మాన్’ ఇప్పుడు 3D రూపంలో మరో వండర్ క్రియేట్ చేస్తుందని పలువురు భావిస్తున్నారు.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, ఈ సమావేశం తమకు కాలేజీ పూర్వ విద్యార్థుల కలయికలా అనిపించిందని చెప్పారు. ‘హను-మాన్’ వంటి చిత్రంలో భాగమవడం తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో 3D టెలివిజన్లు అందుబాటులో లేనందున, ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఇలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కూడా అవసరమేనని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ 3D కన్వర్షన్ తమ బృందం సాధించిన మరో విజయమని కూడా తేజ సజ్జ అన్నారు.
హనుమాన్ 3D ట్రైలర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ 3D రూపంలో వస్తోంది. దయచేసి మీరందరూ జూన్ 25న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చు. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.
చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ, తన పుట్టినరోజు నాడే ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం జీవితాంతం గుర్తుండిపోయే క్షణమని చెప్పారు. ‘హను-మాన్’ వంటి చిత్రాన్ని రూపొందించే అవకాశం తమకు రావడం వెనుక హనుమంతుడు, శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన ఎమోషన్ గా మాట్లాడారు. సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులు చూపిన ఆదరణ ఇప్పుడు 3D వెర్షన్‌కూ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి దుర్గా తేజ్ కూడా 3D వెర్షన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాల్లో హనుమంతుడు తెరపై కనిపించే సన్నివేశాలు 3Dలో అద్భుతంగా అనిపించాయని తెలిపారు. ప్రేక్షకులు ఎలాంటి సందేహం లేకుండా థియేటర్లలో ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఆయన సూచించారు.
పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించిన ‘హను-మాన్’ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, 3D వెర్షన్‌పై ఇప్పటికే సానుకూల స్పందన రావడం చిత్రబృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఇప్పుడు 3D రూపంలో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ థ్రిల్ అందించాలనే లక్ష్యంతో జూన్ 25న మరోసారి పెద్ద తెరపై సందడి చేయనుంది ‘హను-మాన్’. పిల్లల నుంచి పెద్దల దాకా ఈ సినిమాను 3D వెర్షన్ లో చసేందుకు మరోసారి ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తనున్నారు.
- Tags
- cinema
- HanuMan 3D
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!