Site icon NTV Telugu

Hanu-Man: అదేంటి మావా.. థియేటర్ లో అంత లేపారు.. ఇప్పుడు ఓటిటీలోకి వస్తే తిడుతున్నారు

Hanu

Hanu

Hanu-Man: సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్ లో హిట్ అయిన సినిమా ఓటిటీలో ప్లాప్ అవుతుంది. ఇక థియేటర్ లో ప్లాప్ అందుకున్న సినిమా ఓటిటీలో హిట్ టాక్ అందుకుంటుంది. ఇప్పుడు హనుమాన్ విషయం లో కూడా అదే జరిగింది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు ఈరోజు ఆ తరుణం రానేవచ్చింది. నేడు ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కు కు వచ్చింది.

ఇక ఈ సినిమా ఓటిటీలోకి వచ్చాకా నెగెటివిటీ పెరిగింది. హనుమాన్ ను అనవసరంగా థియేటర్ లో ఎత్తేశారు అని, ఈ సినిమాకు అంత లేదని పెదవి విరిచేస్తున్నారు. లాస్ట్ 10 మినిట్స్ తప్ప సినిమాలో చూడడానికి ఇంఏమి లేదని కొందరు అంటుండగా.. విఎఫ్ ఎక్స్ కోసం చూడవొచ్చేమో కానీ, కథ ఏమి లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నెగెటివిటీ తీసుకొచ్చింది ఎవరు..? అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం హనుమాన్ కు ఓవర్ హైప్ ఇచ్చి లేపారు కానీ, సినిమాలో అంత లేదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ నెగెటివిటీ పై చిత్రబృందం ఏమంటారో చూడాలి.

Exit mobile version