Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నాడు. కాగా, తాజగా వడివేలుపై శృంగార తార షకీలా సంచలన వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షకీలా తమిళ్ బుల్లితెరపై కుక్ విత్ కోమలి అనే షో నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆమెకు మంచి పేరునే వచ్చింది. ఇక ఈ షో తరువాత ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం షకీలా కొంతమంది నటీనటులను ఇంటర్వ్యూ చేస్తుంది. అందులో బాగా పేరు ఉన్నవారు కాకుండా చిన్న చిన్న పాత్రలు చేసే నటీనటులు ఉండడం విశేషం. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూకు కోలీవుడ్ నటి ప్రేమ ప్రియ వచ్చింది. తమిళ్ లో కొన్ని చిన్న చిన్న చిత్రాల్లో ప్రేమ ప్రియ నటించింది. వడివేలు నటించిన ఒక సినిమాలో కూడా ఆమె నటించింది. ఇంటర్వ్యూలో ఆమె వడివేలు పై కీలక వ్యాఖ్యలు చేసింది.
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ సెట్ లో అడుగుపెట్టిన సంజయ్ దత్..
” వడివేలుకు నేను అంటే అస్సలు ఇష్టం లేదు.. నాకు ఆయన వలనే ఎన్నో అవకాశాలు దూరమయ్యాయి. మొదట్లో వడివేలు, సంతానం, వివేక్ లాంటి వారి పక్కన చేసేదాన్ని. కానీ, ఆ తరువాత నాకొచ్చిన అవకాశాలకు వడివేలు అడ్డుకట్ట వేశాడు. ఎందుకు ఆయన నాపై ఇంత పగ పెట్టుకున్నారో తెలిసేది కాదు. ఆయన వద్దు అంటే వద్దు అని మేకర్స్ చెప్పేవారు. ఆయనకు తెలియకుండా ఒక సినిమాలో నాకు వేషం ఇచ్చారు. సెట్ లో నన్ను చూసిన ఆయన ఈమె వద్దు.. తీసేయండి అని మేకర్స్ కు చెప్పారు. అలా చాలాసార్లు వెనక్కి పంపేసిన రోజులు ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. అందుకు షకీలా.. మీటూ ఫిర్యాదు చేయకపోయారా అని అడుగగా.. మా మధ్య అలాంటి సమస్య లేదని, వేరే సమస్య ఉందని తెలిపింది. వడివేలు గురించి ఈ విషయాలు చెప్పినందుకు తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని చెప్పింది. ఇక ఈ మాటలకు షకీలా మాట్లాడుతూ.. ” వడివేలు సెట్ లో ఎలా ఉంటాడు.. ఏది మాట్లాడతాడు.. ఆయనకు ఏది అడుగుతాడో తనకు తెలుసు” అని చెప్పుకొచ్చింది. దీంతో వడివేలు కూడా అలాంటివాడా.. ? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.