Site icon NTV Telugu

Hai Nanna: ఓడియమ్మ హీట్.. నాని, శృతి రొమాన్స్..

Hai Nanna

Hai Nanna

Hai Nanna:ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. హాయ్ నాన్న డిసెంబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ కొత్త లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు.

Marimuttu: విషాదం.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి

తాజాగా పార్టీ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ శృతి హాసన్, నానితో చిందేసింది. ఓడియమ్మ హీటు.. అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక పార్టీ సాంగ్ లో ఏమైతే ఉంటాయో.. అవన్నీ ఈ సాంగ్ లో ఉన్నాయి. బీచ్ ఒడ్డున వేసిన సెట్ లో ఈ సాంగ్ ను షూట్ చేసారు. ఇక ఇందులో నాని, శృతి రొమాన్స్ అదిరిపోయింది. అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్.. తమిళ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్, శృతి హాసన్, చిన్మయి శ్రీపాద హస్కి వాయిస్ తో అలరించారు. హేషమ్ అబ్దుల్ వహీమ్ మ్యూజిక్ చాలా ప్రెష్ గా ఉంది. ఇక ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version