ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేసాడు. ఈ మూవీలో మహేష్ బాబు మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తున్నాడు. ఇలాంటి మహేష్ బాబుని చూసి చాలా కాలమే అయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న గుంటూరు కారం మేకర్స్, థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం గ్యారెంటీ.
తలకి రుమాలు కట్టి, బీడీ నోట్లో పెట్టి, చొక్కా గుండీలు వదిలేసిన మహేష్ బాబుని జనవరి 12న చూడబోతున్నాం. పోకిరీ తర్వాత దాదాపు అదే రేంజ్ మాస్ ని ఘట్టమనేని అభిమానులకి మళ్లీ పరిచయం చేయబోతున్నాడు మహేష్. అప్పుడు పండు గాడు ఇండస్ట్రీ హిట్ కొడితే ఇప్పుడు రవణగాడు బాక్సాఫీస్ కి బొమ్మ చూపించబోతున్నాడు. ఇప్పటివరకు ‘పెను తుఫాన్ తలొంచి చూస్తే’, ‘దైవం మానుష్య రూపేణా’ అంటూ మహేష్ ని త్రివిక్రమ్ ప్రెజెంట్ చేస్తే సరైన హిట్ ఇవ్వలేదు ఆడియన్స్. అందుకే ఈసారి ఏకంగా కుర్చీని మడతపెట్టి వస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో పక్కాగా హిట్ కొట్టే మహేష్ బాబు ఈసారి గుంటూరు కారం సినిమాతో నాన్-రాజమౌళి రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. మరి మహేష్ మాస్ మేనియా ఏ రేంజులో ఉంటుంది? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు? అనేది తెలియాలి అంటే జనవరి 12 వరకూ వెయిట్ చేయాల్సిందే.